అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు

Jul 14 2026 4:41 AM | Updated on Jul 14 2026 4:41 AM

అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో అందిన ప్రతీ అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్‌ దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవితో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజావాణిలో అందిన అర్జీలపై పలువురు తహసీల్దార్లతో వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించిన కలెక్టర్‌, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 282 అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్‌డీఓ మేన శ్రీను, అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 191 దరఖాస్తులు అందాయి. కాగా, గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు వరంగల్‌ గిర్మాజీపేట సర్వే నంబర్‌ 10లో హజ్‌హౌస్‌ నిర్మాణానికి 1800 గజాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని, ఆ భూమిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయించిందని, తిరిగి ఆ స్థలంలోనే హజ్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టాలని బీఆర్‌ఎస్‌ మైనారిటీ నాయకులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement