● దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం
కాశిబుగ్గ: వరంగల్‌లోని గ్రంథాలయాన్ని ఈ–గ్రంథాలయంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం కాశిబు గ్గ ఓ సిటీలో వరంగల్ జిల్లా గ్రంథాలయ పరిషత్ చై ర్మన్‌గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకుడు మీసాల ప్రకాశ్‌కు గౌరవం కల్పిస్తూ గ్రంథా లయ సంస్థ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ద్వారా తెలుసుకుంటున్నానని, ప్ర జలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ సీనియర్ నాయకులు గోపాల నవీన్‌రాజు, బుగ్గారెడ్డి, చినబాబు పాల్గొన్నారు.


