న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
● కీలక ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల ఖర్చు
● త్వరలో నగరంలో యూజీడీ పనులు ప్రారంభం
● మామునూరు విమానాశ్రయానికి రెక్కలొచ్చే అవకాశం
● మెగాటెక్స్‌టైల్ పార్కుతో మెండుగా ఉద్యోగాలు
● వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపనున్న వాతావరణం
ఉద్యోగం.. ఉద్యమం
కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగాలివ్వాలనే ఉద్యమం ఊపందుకుంటోంది.
జిల్లా
వరంగల్
ఇఫ్తార్
రాశి : వృషభం
శుక్ర
6:33
అభివృద్ధి.. సవాళ్లు!
నక్షత్రం : రోహిణి
ఆదాయం : 5
వ్యయం : 14
సాక్షి, వరంగల్:
పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కోనుంది. మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాను ముందుకు నడిపితే.. వ్యవసాయం, వాతావరణం, పరిపాలన సమస్యలు కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే అభివృద్ధికి అవకాశం ఎక్కువ.. కానీ, సవాళ్లు కూడా తక్కువ కావు అని జ్యోతిష్య సిద్ధాంతులు చెబుతున్నారు.
మౌలిక వసతుల కల్పన కోసం..
వరంగల్‌ను హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడం కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న గ్రేటర్ వరంగల్‌లో వరద, మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉద్దేశించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లతో ఫేజ్–1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందర్లోనే ఈ పనుల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశాలు ఉండడంతో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అలాగే, ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంతో ఆ నిర్మాణ పనులు కూడా ఈ ఏడాదిలో ప్రారంభించే అవకాశముంది. రంగశాయిపేట నాయుడు పెట్రోల్‌బంకు నుంచి ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. ఇప్పటికే కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాస్కీ (స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) ప్రాజెక్టు కింద రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులతో పాటు వివిధ పనులు పట్టాలెక్కే అవకాశముంది. ఇదిలా ఉండగా సంగెం, గీసుకొండ మండలాల్లో విస్తరించి ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో అంతర్జాతీయ కంపెనీల వృద్ధి పెరిగి జిల్లా ప్రజలకు ఉద్యోగవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
అసాధారణ వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు..
జిల్లాలో అసాధారణ వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులు వ్యవసాయంపై ప్రభావం చూపే అవకాశముంది. ఇది పంటలపై మాత్రమే కాకుండా పట్టణ జీవనంపై ప్రభావం చూపనుంది. అదే సమయంలో నకిలీ విత్తనాలు, పురుగు మందుల సమస్య, పంటల దిగుబడి అస్థిరత, వాతావరణ మార్పుల ప్రభావం ఉండే చాన్స్ ఉంది. మిర్చి, పత్తి పంటలు రైతులకు ఆశ చూపుతున్నప్పటికీ దిగుబడి తగ్గుదల ఆందోళన కలిగించే అవకాశముంది. అయితే సమయానుకూల పనుల వల్ల కొంతమంది రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చే అవకాశం కూడా ఉంది. అలాగే, కీలక ప్రాజెక్టులు పనులు మొదలైనా నిధుల విడుదల్లో జాప్యం, భూసేకరణ ఆలస్యంతో నింపాదిగా అభివృద్ధి పనులు సాగే అవకాశముంది.
అభివృద్ధిలో వరంగల్ దూసుకెళ్తుంది..
స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లాకు రోహిణి నక్షత్రం, వృషభరాశి అవుతుంది. దీని ఆధారంగా ఆదాయం 5, వ్యయం 14 ఉంది. జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులతోపాటు విద్య, వైద్య, ఆరోగ్యం, సాంస్కృతిక రంగాలు, పారిశ్రామిక రంగాల్లో వరంగల్ అభివృద్ధి చెందుతుంది. అందరూ నేతలు కలిసికట్టుగా ఉండడం ద్వారా వరంగల్ నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. రాబడి తక్కువ, వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది.
– శ్రీరామోజు వీరబ్రహ్మచార్యులు,
జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి, ఓసిటీ, వరంగల్


