ఒకేసారి మూడు నెలల రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి మూడు నెలల రేషన్‌

Mar 20 2026 9:20 AM | Updated on Mar 20 2026 9:20 AM

సన్నబియ్యం పంపిణీ చేసేందుకు

పౌరసరఫరాల శాఖ సన్నాహాలు

షాపులకు బియ్యం తరలింపునకు చర్యలు

ఖిలా వరంగల్‌: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న మూడు నెలల్లో మరి ఎండలు ఎలా ఉంటాయోనని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల బియ్యం పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు రేషన్‌ పంపిణీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల బియ్యాన్ని సమకూర్చుకునేందుకు జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో వరంగల్‌, నర్సంపేట, వర్ధన్నపేటలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి జిల్లాలోని మండలాలకు బియ్యం సరఫరా అవుతాయి. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని స్టేజీ–1, స్టేజీ–2 గోదాముల్లో ఏప్రిల్‌ నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని క్వింటాళ్ల బియ్యం నిల్వలున్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ కోటాను ఏప్రిల్‌ లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు.

16,782.84 మెట్రిక్‌ టన్నుల

బియ్యం అవసరం

జిల్లాలో 509 రేషన్‌ షాపుల పరిధిలో 2,93,824 రేషన్‌కార్డులు ఉన్నాయి. 8,88,153 మంది లబ్ధిదారులకు నెలకు 5504.268 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలంటే మొత్తం 16,782.804 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం ఆవసరం ఉంటుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిల్వ చేసేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సన్నబియ్యానికి డిమాండ్‌ భాగా పెరిగింది. స్టేజీ–2 గోదాముల్లో ఒక నెలకు సంబంధించిన బియ్యం నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. మూడు నెలల బియ్యం పంపిణీ కోసం ప్రత్యామ్నాయంగా నిల్వ ఉంచడమా లేక వచ్చిన లారీలను వెంటనే దుకాణాలకు సరఫరా చేయడమా అనేది ఆలోచిస్తున్నారు. చాలా వరకు రేషన్‌ దుకాణాల్లోనూ స్థలం తక్కువగా ఉంది. ఒక నెల బియ్యం మాత్రమే పట్టేలా గదులు ఉన్నాయి. దీంతో దుకాణాలు వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం, లేదా అమ్మగానే డీలరు గోదాముకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.

అదనపు కలెక్టర్‌ ఆదేశాల

ప్రకారం పంపిణీ..

మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నాం. సన్నబియ్యం గోదాముల్లో నిల్వ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. 509 రేషన్‌ దుకాణాల్లో బియ్యం నిల్వ ఎంత మేర సరఫరా చేయాలనేది జాబితా తయారు చేశాం. జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి ఆదేశాల ప్రకారం సన్నబియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం.

– కిష్టయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి

మండలాల వారీగా రేషన్‌షాపులు,

కార్డులు, రేషన్‌ పంపిణీ వివరాలు

మండలాలు రేషన్‌షాపులు కార్డులు మూడు నెలల రేషన్‌

(మెట్రిక్‌ టన్నుల్లో)

చెన్నారావుపేట 23 14,240 784.872

దుగ్గొండి 34 16,044 854.568

గీసుకొండ 35 19,902 1073.778

ఖానాపురం 20 11,087 634.506

నల్లబెల్లి 30 12,882 742.53

నర్సంపేట 40 24,794 1377.168

నెక్కొండ 35 19,264 1073.079

పర్వతగిరి 35 16,636 925.419

రాయపర్తి 37 18,675 1087.923

సంగెం 31 16,562 901.8

వర్ధన్నపేట 32 16,649 935.013

వరంగల్‌ 85 54,613 3332.163

ఖిలా వరంగల్‌ 72 52,476 3059.985

మొత్తం 509 2,93,824 16,782.804

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement