తొలిమొక్కు చెల్లించి.. తల్లులకు ప్రణమిల్లి..
సీఎం పర్యటన విజయవంతం
– వివరాలు 8లోu
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం తెల్లవారుజామున దర్శించుకుని తొలిమొక్కులు చెల్లించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో కలిసి గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పైలాన్‌ను ప్రారంభించారు. ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉదయం 7 గంటలకే హరిత హోటల్‌నుంచి అమ్మవార్ల గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. వీరికి నూతనంగా నిర్మించిన ప్రధాన ఆర్చ్ నుంచి ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయంలో దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రులతో కలిసి సీఎం రేవంత్ పైలాన్‌ను ప్రారంభించారు. ఉదయం సూర్య కిరణాలు పడుతున్న సమయంలో సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని తొలి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా అమ్మవార్లకు చీర పెట్టి, పూలమాల వేశారు. పూజారులు, మంత్రి సీతక్క.. సీఎం రేవంత్‌రెడ్డి, కేబినెట్ మంత్రులకు కంకణాలు కట్టగా, పూజారులు అమ్మవార్ల పసుపు, కుంకుమ బొట్టుపెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, మంత్రులకు పూజారులతో కలిసి మంత్రి సీతక్క చీర, సారె, పట్టువస్త్రాలు అందించి ప్రసాదం(బెల్లం) బహూకరించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం, అధికార గణమంతా రెండు రోజులు మేడారంలోనే పర్యటించడంతో ముందస్తుగానే జాతర మొదలైందన్న సందడి కనిపించింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ చీరలు కట్టుకుని హాజరయ్యారు.
పైలాన్ వద్ద మూడు రాతి శిలలు..
అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ ప్రారంభోత్సవానికి మూడు రాతి శిలలతో ఆదివాసీ సంప్రదాయంగా పైలాన్ ఏర్పాటు చేశారు. అందులో ఒక రాతి శిలపై సీఎంతోపాటు, మంత్రుల పేర్లు చెక్కగా మరో రాతిపై పూజారులు, మరోదానిపై దేవాదాయశాఖ, ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల పేర్లను చెక్కించారు. ఈ పైలాన్ వద్ద అధికారులు, భక్తులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.
పునరుద్ధరించిన గద్దెలను
ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మకు
చీర, సారె చెల్లింపు
మనుమడితో కలిసి
ఎత్తు బంగారం(బెల్లం) సమర్పణ
ఆదివాసీ సంప్రదాయంలో సీఎం,
మంత్రులకు ఘన స్వాగతం
గద్దెలకు నూతన శోభ
మేడారం సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను రకరకాల పూలతో అలంకరించడంతో నూ తన శోభ సంతరించుకుంది. అమ్మవార్ల గద్దెలు, సాలహా రం చుట్టూ ఆర్చ్ ద్వారాలను పూలతో అలంకరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి.. వనదేవతలను ద ర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో క్యూలో ఉన్న భక్తులతో ఆప్యాయంగా పలకరించారు. సీఎంను చూసిన భక్తులు జై రేవంత్‌రెడ్డి, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. మొక్కుల అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో నిలబడి భక్తులకు అభివాదం చేశారు.
మంత్రి ధనసరి సీతక్క
తొలిమొక్కు చెల్లించి.. తల్లులకు ప్రణమిల్లి..
తొలిమొక్కు చెల్లించి.. తల్లులకు ప్రణమిల్లి..
తొలిమొక్కు చెల్లించి.. తల్లులకు ప్రణమిల్లి..


