వినతులు త్వరగా పరిష్కరించాలి
న్యూశాయంపేట: వినతులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీకరించిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖ 26, జీడబ్ల్యూఎంసీ 18, ఇతర శాఖలకు సంబంధించినవి 27 (మొత్తం 71) వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా గంగదేవిపల్లిలో నిర్వహించే సర్పంచ్‌ల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి గ్రీవెన్స్‌కు ఆలస్యంగా రావడం, అధికారులు కూడా ఆలస్యంగా రావడంతో ఫిర్యాదుదారులు ఇబ్బందులు పడ్డారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ప్రజావాణిలో 71 అర్జీలు
న్యాయం చేయండి
గ్రామశివారులోని వ్యవసాయ భూమి నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు పోతుంది. 1.26ఎకరాల భూమితో పాటు జంక్షన్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నా జీవనాధారం పూర్తిగా కోల్పోతున్న. రూ.2కోట్ల భూ పరిహారం ఇవ్వాలి.
– కె.సాంబయ్య, గంగదేవిపల్లి, గీసుకొండ
వినతులు త్వరగా పరిష్కరించాలి


