పాకాలకు సఫారీల కళ
శరవేగంగా మినీ సఫారీ ట్రాక్ నిర్మాణం
పాకాలలో సంవత్సరాల వారీగా ఆదాయం
సాక్షి, వరంగల్/ఖానాపురం: అడవిలోని అందమైన మయూరాలు, జింకపిల్లల పరుగులు, ఎలుగుబంట్లు సహా మరెన్నో జంతువులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పచ్చని చెట్ల నడుమ పక్షుల కిలకిలరావాలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. రణగొణ ధ్వనులకు దూరంగా పచ్చనివనంలో అదో అద్భుత లోకాన్ని తలపిస్తుంది.. ఇప్పుడూ ఇవన్నీ పాకాలలో అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే 15 కిలోమీటర్లతో కూడిన జంగిల్ సఫారీ మినీ ట్రాక్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఇంకోవైపు పాకాల నుంచి భీమునిపాదం, భీమునిపాదం నుంచి పాకాల వరకు 60 కిలోమీటర్లతో కూడిన మహా సఫారీ ట్రాక్ ప్రతిపాదనలు అటవీశాఖ అధికారులు రూపొందించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పనులు చేపట్టనున్నారు. ఇలా పాకాలకు వచ్చే ప్రతీ పర్యాటకుడు నైట్ క్యాంపింగ్‌తో పాటు ఒకరోజు ఉండి ట్రెక్కింగ్, బోటింగ్, వాచ్‌టవర్ల ద్వారా సరస్సు, ప్రకృతి అందాలను వీక్షించేలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు ఇంకోవైపు ప్రకృతిపై జనాలకు అవగాహన కలగనుంది. అలాగే పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని కాటేజీలను సైతం అటవీశాఖ ఆధీనంలోకి తీసుకోనుంది.
‘మినీ సఫారీ’తో ఫుల్ ఎంజాయ్..
నర్సంపేట అటవీశాఖ ఆధ్వర్యంలో పాకాలలో 15 కిలోమీటర్లతో కూడిన మినీ సఫారీ ట్రాక్ పనులు 2025 డిసెంబర్‌లో ప్రారంభించారు. రూ.5లక్షల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు చిలుకమ్మనగర్ వాచ్‌టవర్ నుంచి బుధరావుపేట బీట్‌పరిధిలోని వాచ్‌టవర్ మీదుగా సంగెం కాల్వ వెంట ఉన్న అటవీప్రాంతం నుంచి పాకాలలో ఉన్న పార్క్ వరకు చకచక జరుగుతున్నాయి. మరో నెలరోజుల్లో ఈ పనులు పూర్తయితే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ఈ సఫారీ ట్రాక్ ద్వారా పర్యాటకులను అడవిలోకి తీసుకెళ్లే రెండు సఫారీ వెహికల్స్ 20 రోజుల్లో పాకాలకు రానున్నాయి. ఈ సఫారీ ట్రాక్ వెంట సోలార్ బోర్‌వెల్స్, నీటి గుంతలు, మూడు వాచ్‌టవర్లు, అటవీ ప్రాంతం ఉండనుంది. చిలుకమ్మ గుట్ట హిల్ వాచ్ టవర్ ఎక్కి చూస్తే మూడు వైపుల సరస్సు, ఒకవైపు అటవీ ప్రాంతం, ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ సైట్ వాచ్‌టవర్ వద్ద అక్కడా బిగించిన కెమెరాల్లో చిక్కిన జంతువులు నీళ్లు తాగే దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది. జంతువుల పాదముద్రలు కూడా అక్కడ కనబడతాయి. ఆర్టిస్టిక్ వాచ్ టవర్ ఎక్కి చూస్తే ప్రకృతి రమణీయమైన అటవీ అందాలు పర్యాటకులను ఆకర్షించనున్నాయి. అలాగే వాటర్ స్పోర్ట్స్ పూల్‌లో వాటర్ సైక్లింగ్, జార్బింగ్, వాటర్ రోలర్, పెడల్ బోట్స్ ఉండనున్నాయి. ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో 30 నిమిషాల విడిది గల పాకాలపై డాక్యుమెంటరీ ప్రదర్శన ఉండనుంది.
సఫారీ ట్రాక్‌లతో ప్రకృతిపై అవగాహన
పాకాలకు వచ్చే పర్యాటకులకు నైట్ క్యాంపింగ్ ఉంటుంది. జంతువులు రాకుండా ఉండేందుకు ఫెన్సింగ్ ఏర్పాటుచేసి ప్లాట్ ఫామ్స్, డెన్స్‌తో పాటు వాష్‌రూమ్‌లు కూడా అందుబాటులో ఉంచాం. మరుసటి రోజు ఉదయమే ట్రెక్కింగ్ చేసి, ఆ తర్వాత బోటింగ్ చేశాక మినీ సఫారీ ట్రాక్ ద్వారా అడవిలోకి వాహనంలో వెళ్లవచ్చు. మరో నెలరోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. అలాగే పాకాల నుంచి భీమునిపాదం వరకు జంగిల్ సఫారీ ట్రాక్ అందుబాటులోకి వస్తే ఇంకా పర్యాటక ఊపొస్తుంది.
– పుప్పాల రవికిరణ్, ఎఫ్‌ఆర్వో, నర్సంపేట
పర్యాటకులు ఆదాయం (రూ.)
12,21,210
35,00,000
40,634
41,297
65,000
17,96,860
17,95,470
సంవత్సరం
2022 2023 2024 2025
15 కిలోమీటర్ల పరిధిలో అడవిని చూసేలా ప్రయాణం
పాకాల నుంచి భీమునిపాదం వరకు మరో ట్రాక్
60 కిలోమీటర్ల మేర ఉండేలా అధికారుల ప్రతిపాదనలు
నిధులు మంజూరు కాగానే మొదలవనున్న పనులు
నిర్మాణాలు పూర్తయితే మరింత పెరగనున్న పర్యాటకులు
ఎక్కడి నుంచి ఎక్కడికంటే..
పాకాల అటవీ ప్రాంతం వరంగల్, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దులు కలుపుకొని ఉంటుంది. పాకాల పార్కు నుంచి గుంజేడు మీదుగా భీమునిపాదం, భీమునిపాదం నుంచి తిరిగి పాకాలకు 60 కిలోమీటర్ల దూరంతో కూడిన సఫారీ ట్రాక్‌ను నర్సంపేట, కొత్తగూడ, గూడూరు అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు ఉన్నతాధికారులకు ఇప్పటికే పంపారు. సుమారు రూ.15 నుంచి రూ.20 లక్షల మధ్య వ్యయమయ్యే ఈ ప్రాజెక్ట్‌కు నిధులు రాగానే పనులు చేపట్టనున్నారు.
పాకాలకు సఫారీల కళ
పాకాలకు సఫారీల కళ
పాకాలకు సఫారీల కళ
పాకాలకు సఫారీల కళ
పాకాలకు సఫారీల కళ


