సీపీని కలిసిన నర్సంపేట ఇన్‌స్పెక్టర్
వరంగల్ క్రైం: నర్సంపేట పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ముస్కే శ్రీనివాస్ సోమవారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. పోలీసులపై ప్రజలకు గౌరవం, నమ్మకం పెరిగిలా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కాళోజీ సెంటర్: ఇటీవల కామారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్స్ ప్రాజెక్టుల ప్రదర్శనలో జిల్లా నుంచి 16 ప్రాజెక్టులు పాల్గొనగా నాలుగు ప్రాజెక్టులు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఈ మేరకు సోమవారం కలెక్టర్ సత్యశారద ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తన చాంబర్‌లో అభినందించారు. త్వరలో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి ప్రదర్శనలో పాల్గొనన్నారు. ఎంపికై న వారిలో పర్వతగిరి మండలం రోళ్లక ల్లు పాఠశాల విద్యార్థి సాయిరామ్, ఖానా పురం మండలం బుధరావుపేట జెడ్పీ పాఠశాల విద్యార్థి రబియా, ఆరేపల్లి ఎన్‌ఎస్‌ఆర్ వి ద్యార్థి నిత్యశ్రీ, ఠాగూర్ విద్యామందిర్ విద్యార్థి అంజలి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు గైడ్ టీచర్లు, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.
ఖోఖో జట్టు కెప్టెన్‌గా ఉదయశ్రీ
నర్సంపేట: నారాయణపేట జిల్లాలో జరుగుతున్న 35వ తెలంగాణ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ షిప్‌లో నర్సంపేటలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న ఎడ్ల ఉదయశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో జట్టుకు సారధిగా ఎంపికై ంది. ఈ మే రకు ఎంఈఓ కొర్ర సారయ్య, పీడీ రాంబాబు ఉదయశ్రీని అభినందించారు.
హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులతో జాగ్రత్త
గీసుకొండ: జిల్లాలో హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులతో వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు జాగ్రత్తలు వహించాలని డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు అన్నారు. సోమవారం ఆరోగ్య కా ర్యకర్తలకు రాష్ట్ర ఆర్మాన్ టీం ద్వారా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధిక రక్తపోటు, మధుమేహం, గర్భాశయ సమస్యలు, బహుళ శిశువుల జన నం, తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పి తదితరాలు హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో లక్షణాలుగా కనిపిస్తాయన్నారు. అలాంటి సమస్యలను త్వ రగా గుర్తించి ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఆర్మాన్ టీం కన్సల్‌టెంట్ డాక్టర్ సంతోషిని ప్రెగ్నెన్సీ సమస్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మాతాశిశు సంరక్షణ అధికారి ప్రసన్న లక్ష్మి, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, పీహెచ్‌ఎన్ మనోజ్, నా గరాజు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీని కలిసిన నర్సంపేట ఇన్‌స్పెక్టర్


