ప్రజలకు అందుబాటులో ఉండాలి
గీసుకొండ: గ్రామాల్లో సర్పంచ్‌లు ఆదర్శంగా పా లన కొనసాగిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో జి ల్లాలోని సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్పంచ్‌లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండి గ్రామపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో నేర్చుకోవాలన్నారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన, సర్పంచ్‌ల విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, విపత్తులను ఎదుర్కోవడం, డిజిటల్ సైన్స్, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం లాంటి వాటిపై శిక్షణలో సర్పంచ్‌లకు అవగాహన కలిగిస్తారన్నారు. జెడ్పీసీఈఓ రాంరెడ్డి, టీఓటీలు పాక శ్రీనివాస్, కూచన ప్రకాశ్, చంద్రకాంత్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, ఎంపీడీఓలు కృష్ణవేణి, ఆరుంధతి, రవీందర్, డీఎల్‌పీఓ లు వేదవతి, రాజేందర్, స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ ఎం.శ్రీనివాస్, ఎంపీఓ అంబటి సునిల్‌కుమార్‌రా జు, సురేశ్, రమ్యకుమారి, కూసం స్వరూప, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కా గా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యంతండా సర్పంచ్ భూక్య ఉమ తన చంటి పాపతో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రతీ కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదు కమిటీ
న్యూశాయంపేట: మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం–2013 ప్రకారం పది మంది కంటే ఎక్కువ సిబ్బంది పనిచేసే ప్రతీ కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశహాల్‌లో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళల భద్రతకు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతీ శాఖాధిపతి, కార్యాలయ అధికారిపై ఉందన్నా రు. కమిటీలో 50శాతం మహిళల భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు. అనంతరం లైంగిక వేధింపుల నివారణ చట్టం వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆ విష్కరించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి, జిల్లా మ హిళా సాధికారత కేంద్ర అధికారులు పాల్గొన్నారు.
పథకాలపై సంపూర్ణ అవగాహన అవసరం
కలెక్టర్ సత్యశారద
సర్పంచ్‌ల శిక్షణ తరగతులు షురూ
వడ్డీ లేని రుణ ప్రక్రియ పూర్తి చేయాలి
న్యూశాయంపేట: మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈఓ దివ్యాదేవరాజన్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ వీసీలో కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రుణాలు, చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు ఆర్డీఓలు, తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


