సర్వే మిషన్‌పై అవగాహన ఉండాలి
హన్మకొండ అర్బన్: భూమి సర్వేకు సంబంధించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన నూతన సర్వే మిషనన్‌పై లైసెన్స్‌డ్ సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. భూముల కొలతల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితత్వంతో సర్వే నిర్వహించాలన్నారు. భూమి కొలతల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నూతన సర్వే మిషన్‌న్‌తో భూముల కొలతలు ఎలా చేపట్టాలనే అంశంపై సర్వేయర్లకు శిక్షణ కొనసాగుతోంది. హైదరాబాద్ భూమి కొలతల శాఖ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో గురు, శుక్రవారం ధర్మసాగర్, హసన్‌పర్తి మండలాల సర్వేయర్లు ఈ శిక్షణ అందిస్తుస్తుండగా.. కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లా భూమి కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్.శ్రీనివాసులు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు సారంగపాణి, రాజనర్సింహ, సంబంధిత మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ సమీక్ష
పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల పురోగతిపై కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో నేషనల్ హైవేస్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసమావేశంలో 163 జి గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే ని ర్మాణానికి పూర్తయిన భూ సేకరణ, రైతులకు ప రిహారం చెల్లింపు, రహదారి నిర్మాణంలో ఏవైనా ఇ బ్బందులు ఉన్నాయా? అని అధికారులను అడిగా రు. జిల్లా అదనపు కలెక్టర్ రవి, నేషనల్ హైవే వరంగల్ విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ, పరకాల ఆర్డీఓ కన్నం నారాయణ, సూపరింటెండెంట్ జగత్‌సింగ్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
కలెక్టరేట్‌లో సర్వేయర్లకు శిక్షణ


