పురుగుల అన్నం తినలేం..
సంగెం: తరచూ పురుగుల అన్నం, సమయపాలన లేని టిఫిన్, వంట మనుషులు తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదుల బాక్స్‌లో చీటీలు రాసి వేశారు. శుక్రవారం సంగెం మండలకేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల వి ద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు, వంటగది, స్టోర్‌రూం అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. వినియోగంలో లేని మరు గుదొడ్లను మరమ్మతు చేయించకపోవడం, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం, వంట సరుకుల స్టో ర్ రూం అపరిశుభ్రంగా ఉండటం, వంట మనుషులు విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడం పట్ల ఎస్‌ఓ నీలిమకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. సకాలంలో టిఫిన్ తయారు చేయడం లేదని, టిఫి న్, భోజనంలో తరచూ పురుగులు వస్తున్నాయని వంట మనుషులు తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వంట మనుషులు విజయ, లలిత, స్వరూపలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వంట మనుషులు, కొందరు టీచర్లు అసభ్యపదజాలాన్ని ఉపయోగిస్తున్నారని బాలికలు ఫిర్యాదుల పెట్టెలో చీటీలు రాసి వేశారు. ఇంటర్, 10, 9వ తరగతి విద్యార్థినులతో వేర్వేరుగా కలెక్టర్ మా ట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెస్ ఇన్‌చార్జ్ సివిక్స్ టీచర్ అనితను సస్పెండ్ చే యాలని డీఈఓను ఆదేశించారు. అకౌంటెంట్ దీపా సెలవు పెట్టకుండా గైర్హాజరు కావడంపై ఎస్‌ఓ నీలి మను మందలించారు. ఈ సందర్భంగా సెలవులకు తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి జిల్లా డీసీహెచ్‌ఎస్ కె. రామ్మూర్తి, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంఈ ఓ నర్సింహచార్యులు, ఎస్‌ఓ నీలిమ పాల్గొన్నారు.
ఎస్‌హెచ్‌జీలకు ఉపాధి అవకాశాలు
న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల హౌసింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు స్వయం సహాయ సంఘాల కుటుంబాలకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ చాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 43 మంది ఎస్‌హెచ్‌జీ కుటుంబ సభ్యులకు జగిత్యాలలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో ఆరురోజుల పాటు సెంట్రింగ్ యూనిట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించామని, శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు యూనిట్‌కు రూ.4లక్షల వ్యయంతో పీఎంఈజీపీ పథకం క్రింద 35శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి, జీఎం ఇండస్ట్రీయల్ నరసింహామూర్తి, పీడీ ఇన్‌చార్జ్ హౌసింగ్ ఎన్.శ్రీవాణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సమాజాన్ని చైతన్య పరచాలి
వరంగల్ చౌరస్తా: సమాజాన్ని చైతన్య పర్చడంలో జర్నలిస్టు పాత్ర కీలకమని కలెక్టర్ సత్యశారద అన్నారు. జాతీయ రోడ్డు భద్రతావారోత్సవాల్లో భా గంగా శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూ నియన్ (టీఎస్‌జేయూ) ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ సత్యశారద మాట్లాడారు. డీటీఓ శోభన్, ట్రా ఫిక్ సీ ఐ సుజాత, పరశురాములు, తహసీల్దార్ శ్రీ కాంత్, సతీష్, టీఎస్‌జేయూ నేతలు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పెట్టెలో చీటీలు రాసి వేసిన విద్యార్థినులు
హాస్టల్ నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం
ముగ్గురు వంట మనుషుల తొలగింపు
మెస్ ఇన్‌చార్జ్ సస్పెన్షన్
సంగెం కేజీబీవీలో కలెక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీలు


