నీటిని పొదుపుగా వాడుకోవాలి
● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఖానాపురం: యాసంగి సాగులో నీటిని పొదుపుగా వాడుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని పాకాలలో యాసంగి సాగుకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాకాలలో ప్రస్తుతం 28.5 ఫీట్ల నీరు ఉందని, నీరు సరిపోకపోతే గోదావరి జలాలు తీసుకువచ్చి రైతుల పంటలకు అందజేస్తామన్నారు. కాల్వల ఆధునీకరణకు రూ.137 కోట్లు ఈఎన్‌సీ నుంచి ఫైనాన్స్‌కు వెళ్లాయని, మూడు రోజుల్లో అనుమతులు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ సుదర్శన్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, హరిబాబు, యడ్ల జగన్మోహన్‌రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
నర్సంపేటను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే
నర్సంపేట: నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు పట్టణంలోని అభివృద్ధి పనులను చేస్తున్నామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో అప్పటి ఎమ్మెల్యే, ఇద్దరు చైర్మన్లు ఉన్నప్పటికీ తట్టడి మట్టి కూడా పోయలేదన్నారు. రానున్న ఎన్నికల్లో పట్టణంలో 30స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


