కేజీబీవీ సందర్శన
గీసుకొండ: మండలంలోని వంచనగిరి కేజీబీవీని అదనపు కలెక్టర్ సంధ్యారాణి శుక్రవారం సందర్శించారు. విద్యాలయం ఆవరణ, పరిసరాలు, వంటగది, వంటలు, డార్మెటరీ, తరగతి గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యాలయంలోని వసతిగృహంలో బాలికలకు సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ వసుంధర, మండల ప్రత్యేక అధికారి సురేశ్, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంఈఓ ఎస్.రవీందర్, విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ హిమబింధు, సీఆర్‌పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి నిర్మించేంత వరకు ఉద్యమం
వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలో వందపడకల ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగుతుందని వందపడకల ఆస్పత్రి సాధన సమితి సభ్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో సాధన సమితి సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ వంద పడకల ఆస్పత్రి నిర్మాణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వర్ధన్నపేట ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వ్యవహారించి పట్టణంలోనే ఆస్పత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ జేఏసీ నాయకుడు తుమ్మల శ్రీధర్, బీఆర్‌ఎస్ నాయకులు తోటకూరి శ్రీధర్, రాజమణి, మహిళా సంఘాల నాయకురాల్లు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
నేడు రిజిస్ట్రేషన్ మేళా
న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్) కోసం లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళాను నేడు (శనివారం) నిర్వహించనున్నట్లు జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేళా హనుమకొండ సుబేదారి, వరంగల్ పాత డీటీఓ కార్యాలయం ఆవరణలో ఉదయం పది నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నా రు. తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఆహార భద్రతాధికారి 7330643793, గెజిటెట్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ 9985820544 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో ప్రతిభ
నర్సంపేట రూరల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపియాడ్‌లో కేజీబీవీ విద్యార్థినులు ప్రతిభకనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా రు. శుక్రవారం వరంగల్ లాల్ బహదూర్ కళాశాలలో జిల్లా స్థాయి కాంపిటేషన్ నిర్వహించారు. ఇందులో చెన్నారావుపేట కస్తూర్భా విద్యార్థినులు శ్రీరామ్‌శెట్టి రష్మిత మొదటిస్థానం, అక్షిత ద్వితీయ స్థానంలో నిలిచింది. ఎడ్యుటాక్ అనే అంశంలో గూడెల్లి వైష్ణవి, తేజశ్రీలు ప్రతిభ కనబర్చినట్లు స్పెషలాఫీసర్ మెట్టుపల్లి జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్ రజినిని, విద్యార్థులను స్పెషలాఫీసర్, ఉపాధ్యాయులు అభినందించారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో సీఈటీఎస్‌బీ–26 (ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ స్టక్చరల్ బయోఫిజిక్స్)పై మూడు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిట్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలకుగాను అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎస్‌ఐఆర్ మాజీ డీజీ, ప్రొఫెసర్ శేఖర్.సీ.మండే, బయోటెక్నాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ బి.రామరాజు, కిరణ్‌కుమార్, సౌమ్య లిప్సా పాల్గొన్నారు.
కేజీబీవీ సందర్శన
కేజీబీవీ సందర్శన


