ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Dec 31 2025 8:44 AM | Updated on Dec 31 2025 8:44 AM

ఫుడ్‌

ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

నర్సంపేట: నర్సంపేటలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. ఇన్‌స్పెక్టర్లు కృష్ణమూర్తి, మౌనిక, ల్యాబ్‌ టెక్నీషియన్‌ నరేశ్‌, నర్సంపేట మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో హోటల్స్‌, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు, కిరాణా షాపులు, జనరల్‌ స్టోర్స్‌, బిర్యానీ సెంటర్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు గిరగాని సుదర్శన్‌గౌడ్‌, విజిలెన్స్‌ కమిటీ మెంబర్స్‌ నాగెల్లి సారంగం, మైస వసంత, జిల్లా ఎస్సీ, ఎస్టీ కన్వీనర్‌ బోయిన వెంకటస్వామి పాల్గొన్నారు.

యాసంగికి సరిపడా యూరియా నిల్వలు

న్యూశాయంపేట: జిల్లాలో యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అన్ని యూరియా విక్రయ కేంద్రాలు తెరిచి ఉంటాయని, అదనపు యూరియా కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.

మౌలిక వసతులపై దృష్టి పెట్టండి..

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో మంగళవారం మండల స్పెషల్‌ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. .

రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు షురూ

పర్వతగిరి: మండలంలోని అన్నారం పల్లవి మోడల్‌ స్కూల్‌లో రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎంఈఓ అల్లందాసు భిక్షపతి, సర్పంచ్‌ గాడిపల్లి మహేందర్‌ హాజరై అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ శ్రీనివాసులు, కార్యదర్శి సీహెచ్‌ ఐలయ్యతో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లవి పాఠశాల చైర్మన్‌ రాచకొండ అశోకాచారి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ షూటింగ్‌ బాల్‌ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అసోసియేషన్‌ను అభినందించారు. తహసీల్దార్‌ వెంకటస్వామి, కల్లెడ పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ మోటపోతుల మనోజ్‌గౌడ్‌, కరస్పాండెంట్‌ గంజి మహేందర్‌, డైరెక్టర్‌ రమేశ్‌, స్పోర్ట్స్‌ హెచ్‌ఓడీ రాజు, ఏఓ బైరి అశోక్‌, అకౌంటెంట్‌ వర్మ, ఉపాధ్యాయులు జయంతి, రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

సామాజిక తనిఖీ ప్రజావేదిక

పర్వతగిరి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. పలువురికి జరిమానా విధించారు. డీఆర్డీఓ రాంరెడ్డి, ఏపీడీ శ్రీవాణి, జిల్లా విజిలెన్స్‌ అధికారి అలివేలు, ఎంపీడీఓ శంకర్‌నాయక్‌, ఎస్‌టీఎం అజయ్‌, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ రమేశ్‌, ఎస్సారెస్పీ అధికారి గంగరాజు పాల్గొన్నారు.

ఇరువర్గాలపై కేసు

గీసుకొండ: మండల కేంద్రానికి చెందిన ఇరువర్గాలు గొడవపడగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గీసుకొండకు చెందిన మేకల రమేశ్‌ను అదే గ్రామానికి చెందిన మేకల జీవన్‌తోపాటు కొందరు దుర్భాషలాడగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. అలాగే, మేకల జీవన్‌ తన తల్లి మరియను బైక్‌పై ఎక్కించుకుని వెళ్తుండగా పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని దౌడు సునీల్‌, బాబు అడ్డగించారు. ఇష్టం వచ్చినట్లు కొట్టి దుర్భాషలాడి చంపుతామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు1
1/2

ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు2
2/2

ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement