వైభవంగా వైకుంఠ ఏకాదశి
జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ప్రజలు మంగళవారం వైభవంగా జరుపుకున్నారు. బ్రహ్మ ముహూర్తంలో భక్తులు వైష్ణవాలయాలను సందర్శించి, ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. వరంగల్ నగరం, నర్సంపేట,
వర్ధన్నపేట పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఆలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. శ్రీమహా విష్ణువు ముక్కోటి దేవతలతో గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చాడు గనుక ముక్కోటి ఏకాదశి అంటారని అర్చకులు తెలిపారు.
– సాక్షి, నెట్‌వర్క్
వరంగల్‌లో బాలానగర వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న మంత్రి కొండా సురేఖ
వైష్ణవాలయాల్లో మార్మోగిన గోవింద నామస్మరణ
ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్న భక్తులు
వైభవంగా వైకుంఠ ఏకాదశి
వైభవంగా వైకుంఠ ఏకాదశి
వైభవంగా వైకుంఠ ఏకాదశి


