వినియోగదారులు చైతన్యం కలిగి ఉండాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి
సంగెం: వినియోగదారులు చైతన్యం కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివియోగదారుల హక్కులు.. బాధ్యతలు.. పరిష్కార మార్గాలు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ స్థానం కేజీబీవీ విద్యార్థిని బి.రక్షిత, ద్వితీయస్థానం సంగెం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి పెరుమాండ్ల చరణ్ సాధించారు. బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి చేతుల మీదుగా వారు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వినియోగదారుల చట్టం అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్టినేటర్ పులి రాజశేఖర్, గైడ్ టీచర్ తాటిపాముల రమేశ్, కేజీబీవీ పీఈటీ పద్మ తదితరులు పాల్గొన్నారు.


