తూర్పు కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు | - | Sakshi
Sakshi News home page

తూర్పు కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు

Aug 21 2025 7:26 AM | Updated on Aug 21 2025 7:26 AM

తూర్ప

తూర్పు కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు

తూర్పు కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు

రామన్నపేట : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌లో మరోసారి వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. వరంగల్‌ ఎంజీఎం జంక్షన్‌లోని రాజీవ్‌ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే నాగరాజు తమ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. ముందుగా స్వర్ణ, సారయ్య రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న మంత్రి కొండా సురేఖ రెండు నిమిషాల పాటు ఆగి వేరుగా విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో ఆయా నేతల అనుచరులు జై కొండా.. జై సారన్న, జై నాగరాజు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తింది. ఆ తర్వాత సారయ్య వర్గం నాయకులు అక్కడినుంచి వెళ్లిపోయారు.

మరోసారి చర్చ..

కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ నేతలపై బహిరంగంగానే విమర్శలు చేయడంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసేందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇరువర్గాల నాయకులను పిలిచి మాట్లాడి గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా ఏకతాటిపై నిలవాలని సూచించింది. వరంగల్‌ జిల్లాలో జరుగుతున్న రాజకీయాలను అధిష్టానంతో నిత్యం పర్యవేక్షిస్తున్న సమయంలో రాజీవ్‌గాంధీ జయంతి వేదికగా మరోసారి విబేధాలు బహిర్గతమవడం చర్చకు దారి తీసింది.

రాజీవ్‌గాంధీ తెచ్చిన రిజర్వేషన్లే

నన్ను మంత్రిని చేశాయి..

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ నాడు తన హయాంలో స్థానిక సంస్థల్లో ఇచ్చిన రిజర్వేషన్ల వల్లే ప్రస్తుతం తాను మంత్రిస్థాయి ఎదిగానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎంజీఎం జంక్షన్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. దేశంలో పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికను జోడించాల ఆనాడు రాజీవ్‌గాంధీ ఆలోచన చేశారని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ జయంతి వేడుకల సమయంలో రాజకీయాలు చేయడం తగ్గదంటూ కార్యకర్తలను సముదాయించారు. తాను రాకముందే పూలమాలలు వేయడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.

రాజీవ్‌గాంధీ జయంతి వేదికగా

బహిర్గతం

ముందుగా జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాళి

అనంతరం వచ్చిన మంత్రి సురేఖ..

ఆ సమయంలో ఇరువర్గాల నినాదాలు..

తూర్పు కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు1
1/1

తూర్పు కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement