
ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో యూరియా కొరత లేద ని, సక్రమ పంపిణీ కోసం అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అవసరం మేరకు యూరియా కేటాయించినట్లు తెలిపారు. ఎరువుల కంపెనీల ప్రతినిధులు, ఎరువుల డీలర్లు సహకరించాలని కోరారు. రెవెన్యూ, పోలీస్ వ్యవసాయ శాఖ ల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు రాంరెడ్డి, అనురాధ, నీరజ, కల్పన పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్..
జిల్లాలో యూరియా పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. రైతుల సౌకర్యార్థం 18004253424 టోల్ ఫ్రీ నంబర్, 0870–2530812, 9154252936 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.
కీర్తినగర్ యూపీహెచ్‌సీ తనిఖీ..
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ కీర్తినగర్‌లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రక్తపరీక్షలు, మందులు నిల్వచేసే గదులు, ఐపీ వార్డు, బెడ్స్, టాయిలెట్లు, వ్యాక్సినేషన్‌ను ఆమె పరిశీలించారు. ప్రతి రోజు ఎంతమంది రోగులు వస్తున్నారని సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. పారాసిటమాల్ మాత్రలు ఎక్కువగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం మేరకు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని ఆదేశించారు. యూపీహెచ్‌సీ పరిసరాలను మరింత శు భ్రంగా ఉండేలా చూసుకోవాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్, మెడికల్ ఆఫీసర్ హుస్సేన్ ఉన్నారు.
అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద