
రూ.42 లక్షలకు లెక్కలు చూపించడం లేదు
గీసుకొండ: ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ గత కార్యవర్గంలోని నాయకులు ఫిరోజ్, అజ్మల్ సుమారు రూ.42 లక్షలకు లెక్కలు చూపించకుండా అక్రమాలకు పాల్పడ్డారని అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎండీ షకీల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్, నాయకుడు ఇజగిరి శంకర్ ఆరోపించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరు చెప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతం హోల్‌సేల్ కమర్షియల్ కాప్లెక్స్ పక్కన ఉన్న లారీ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. తాము గతం నుంచి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, జిల్లా నాయకుడు గోపాల నవీన్‌రాజ్ సహకారంతో లారీ ఓనర్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఫిరోజ్, అజ్మల్ తదితరులు నియంతృత్వ పోకడలతో అసోసియేషన్‌కు చెందిన రూ.42 లక్షలకు లెక్కలు చూపించకుండా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసులు నమోదు చేయించారని వాపోయారు. అసోసియేషన్ పార్కింగ్ స్థలానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పందించి లారీ కార్మికులకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు.
ఎమ్మెల్యే పేరు చెప్పి ఇబ్బంది పెడుతున్నారు
తమపై అక్రమంగా
కేసులు బనాయిస్తున్నారు
ఓరుగల్లు లారీ ఓనర్స్
అసోసియేషన్ నాయకులు