వాహనాల వేలం | - | Sakshi
Sakshi News home page

వాహనాల వేలం

Aug 21 2025 8:49 AM | Updated on Aug 21 2025 8:49 AM

వాహనాల వేలం

వాహనాల వేలం

నర్సంపేట రూరల్‌: నర్సంపేట ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన వాహనాలకు బుధవారం వేలం నిర్వహించినట్లు అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మురళీధర్‌ తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్‌ అధికారి అరుణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు 19 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించగా ప్రభుత్వానికి రూ.3,11,460 ఆదా యం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. నర్సంపేట ఎకై ్సజ్‌ సీఐ నరేశ్‌రెడ్డి, ఎకై ్స జ్‌ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

13 మంది

సబ్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీ

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌. వెంకన్న వీఆర్‌ నుంచి దేవరుప్పుల పీఎస్‌, జి.శ్రీదేవి తరిగొప్పుల నుంచి వరంగల్‌ సీసీ ఎస్‌, ఎం.రాజు గీసుకొండ నుంచి ముల్కనూ రు, ఎన్‌.సాయిబాబు ముల్కనూరు నుంచి వర్ధన్నపేట, బి.చందర్‌ వర్ధన్నపేట నుంచి టాస్క్‌ ఫోర్స్‌, జి.అనిల్‌కుమార్‌ వీఆర్‌ నుంచి గీసుకొండ, టి.విజయ్‌రాజు వీఆర్‌ నుంచి గీసుకొండ, ఎం.కుమారస్వామి వీఆర్‌ నుంచి వరంగల్‌ ట్రాఫిక్‌, ఈ.రతీశ్‌ వీఆర్‌ నుంచి సీఎస్‌బీ వరంగల్‌, హెచ్‌.ఆనందం వీఆర్‌ నుంచి సీఎస్‌బీ వరంగల్‌, టి.యాదగిరి వరంగల్‌ ట్రాఫిక్‌ నుంచి సీసీఎస్‌ వరంగల్‌, ఈ.నారయణ హనుమకొండ ట్రాఫిక్‌ నుంచి వీఆర్‌ వరంగల్‌కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

జూనియర్‌

సివిల్‌ జడ్జిల నియామకం

వరంగల్‌ లీగల్‌: రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికై న 49 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిలను వివిధ జిల్లాలకు నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదుగురు జూనియర్‌ సివిల్‌ జడ్జిలను నియమించారు. వరంగల్‌ నాలుగో మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు (ఎకై ్సజ్‌ కోర్టు) జడ్జిగా రాజ్‌నిధి, నర్సంపేట జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఊట్లూరి గిరిధర్‌, హనుమకొండ రెండో మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు (పీసీఆర్‌ కోర్టు) జడ్జిగా బానావత్‌ అనూష, పరకాల మొదటి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు బొడ్డు శ్రీవల్లి శైలజ, ములుగు మొబైల్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా దక్కన్నగారి మధులిక తేజను నియమించారు.

రెండు కిలోల

ఎండు గంజాయి స్వాధీనం

నర్సంపేట రూరల్‌: ఎండు గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ద్వారకపేట బైపాస్‌ రోడ్డు– మహబూబాబాద్‌ రోడ్డు సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న యువకులను ఆపి తనిఖీ చేశారు. ద్విచక్రవాహనం పెట్రోల్‌ ట్యాంకు కవర్‌లో రెండు కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. వారిని విచారించగా భద్రాద్రి జిల్లా చింతూరు మండలం మోతుగూడేనికి చెందిన నాగు అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలుచేసినట్లు తెలిపారని అన్నారు. అరెస్టు చేసిన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉసిరికాయపల్లికి చెందిన వరుణ్‌దొర, ఇల్లందులోని జేకే కాలనీకి చెందిన ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు. గంజాయి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement