క్యూలో ఉన్నా అందని యూరియా | - | Sakshi
Sakshi News home page

క్యూలో ఉన్నా అందని యూరియా

Aug 21 2025 8:49 AM | Updated on Aug 21 2025 8:49 AM

క్యూల

క్యూలో ఉన్నా అందని యూరియా

ఖానాపురం: రైతులకు యూరియా కష్టాలు తీరడంలేదు. రాత్రి, పగలు తేడా లేకుండా సొసైటీ గోదాంలు, రైతువేదికల వద్ద యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఖానాపురం మండలంలోని బుధరావుపేట, మనుబోతులగడ్డ గ్రామాల్లో రైతులు యూరియా కోసం బుధవారం బారులు తీరారు. బుధరావుపేటకు 444 బస్తాల యూరియా వచ్చింది. టోకెన్ల కోసం రైతువేదిక వద్ద తెల్లవారుజాము నుంచే 600మందికి పైగా రైతులు, మహిళలు, చిన్నారులు క్యూలైన్లలో నిల్చున్నారు. కొంతమందికి మాత్రమే టోకెన్లు అందించి అధికారులు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. క్యూలో ఉన్నా తమకు యూరియా అందలేదని మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో బుధరావుపేటలో క్యూలో నిల్చున్న రైతు అలీపాషా సొమ్మసిల్లిపడిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. యూరియా అందలేదని రైతులు జాతీయ రహదారి–365పై రాస్తారోకో చేపట్టారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మద్దతు తెలిపి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఎస్సై రఘుపతి, ఏఓ శ్రీనివాస్‌ చేరుకుని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. రెండు గంటలకు పైగా రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మనుబోతులగడ్డలో 444 బస్తాల యూరియా రావడంతో రైతులు బారులు తీరారు.

మేడపల్లిలో..

నల్లబెల్లి: మేడపల్లి గ్రామంలో ఉదయం నాలుగు గంటల నుంచి రైతులు యూరియా కోసం బారులు తీరారు. పీఏసీఎస్‌ సిబ్బంది గోదాం వద్దకు ఉదయం 7 గంటలకు చేరుకున్నారు. గోదాంలో తక్కువ బస్తాలు ఉన్నాయని తెలుసుకుని రైతులు ఎగబడ్డారు. దీంతో తోపులాట జరుగగా రైతు నూనావత్‌ కిషన్‌కు గాయమైంది. ఎస్సై గోవర్ధన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతుకు రెండు బస్తాల చొప్పున 20 మెట్రిక్‌ టన్నుల యూరియా పంపిణీ చేశారు. ఫర్టిలైజర్‌ షాపు, గ్రోమోర్‌ షాపులకు వెళ్లి యూరియా తీసుకోవాలని ఏఓ రజిత సూచించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని సొసైటీ చైర్మన్‌ చెట్టుపల్లి మురళీధర్‌ అన్నారు. నాగరాజుపల్లి, నందిగామ, బోల్లోనిపల్లిలో అదనంగా యూరియా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

సూరిపల్లిలో..

నెక్కొండ: సూరిపల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న యూరియా కోసం రైతులు బారులుదీరారు. పీఏసీఎస్‌ పరిధిలోని సూరిపల్లి, చిన్నకొర్పోలు, నాగారం రెవెన్యూ గ్రామాల రైతులకు బదులు గూడూరు, కేసముద్రం మండలాల రైతులు ఇక్కడకు వచ్చారని ఏఓ నాగరాజు తెలిపారు. వీరిని గుర్తించి తిరిగి పంపించినట్లు ఆయన తెలిపారు. అనంతరం 250 మంది రైతులకు 444 బస్తాల యూరియా అందించామని ఆయన పేర్కొన్నారు.

చౌటపల్లి గ్రామంలో..

పర్వతగిరి: చౌటపల్లిలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు.

బుధరావుపేటలో

సొమ్మసిల్లిపడిపోయిన రైతు

జాతీయ రహదారి–365పై రాస్తారోకో

రెండు గంటల పాటు నిలిచిన వాహనాలు

క్యూలో ఉన్నా అందని యూరియా1
1/2

క్యూలో ఉన్నా అందని యూరియా

క్యూలో ఉన్నా అందని యూరియా2
2/2

క్యూలో ఉన్నా అందని యూరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement