
చలాన్లు.. చాలానే..
ట్రాఫిక్ స్టేషన్ల వారీగా పెండింగ్ ఇలా..
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడంతో పోలీసులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో జరిమానాలు విధిస్తున్నారు. ఇలా కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ చలాన్లు చాంతాడంత పేరుకుపోయాయి. వాహనదారులు తర్వాత చెల్లించవచ్చు అనే ఆలోచనలో ఉండడంతో రోజురోజుకూ పెండింగ్ జరిమానాలు పెరిగిపోతున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 1,27,194 వాహనాలపై మొత్తం 11,71,094 చలా న్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి మొత్తం సుమారు రూ.33.28కోట్ల జరిమానాలు చెల్లించాల్సి ఉంది.
పోలీస్ కంప్యూటర్ డేటా బేస్‌లో
వాహనాల వివరాలు..
పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల పూర్తి వివరాలు పోలీస్ కంప్యూటర్ డేటా బేస్‌లో నమోదు చేసినట్లు సీపీ చెబుతున్నారు. ఈ చలాన్లను క్లియర్ చేసేందుకుగాను ఇకపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. తనిఖీ సమయంలో చలాన్లు గుర్తిస్తే వెంటనే జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో అన్ని కూడళ్లలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు అమర్చారు. వీటి ఆధారంగా వాహనదారుడు ప్రయాణించే మార్గంలోని పోలీస్ ట్యాబ్‌లకు సమాచారం వెళ్తుంది. అక్కడి పోలీసులు మీ వాహనాలను రోడ్డుపై నిలిపివేసి జరిమానాలు క్లియర్ చేస్తారు.
జరిమానాలు సరే.. ట్రాఫిక్ క్లియరెన్స్ ఏదీ?
వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడం లేదని, సెల్‌ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, సిగ్నల్ క్రాసింగ్ ఇలా చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. రోడ్లపై ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్ కేంద్రాల్లోని కూడళ్లలో, హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఆటోలు, ఇతర వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిపి ఉంచి మిగతా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సిబ్బంది వాహనాలను క్రమబద్ధీకరించకుండా కెమెరా, ఫోన్‌తో వాహనదారుల ఫొటోలు తీయడంలోనే బిజీగా ఉంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
చలాన్లు క్లియర్ చేయకపోతే వాహనం సీజ్
పెండింగ్ చలాన్లు క్లియర్ చేయని పక్షంలో వాహనాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవుతున్నాయి. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో పోలీసులు జరిమానాలు విధిస్తారు. జరిమానాలు సకాలంలో చెల్లించాలి.
– వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 11,71,094 పెండింగ్
ట్రాఫిక్ చలాన్లు
ఇందులో 10లక్షల వరకు
గ్రేటర్ వరంగల్ పరిధిలోనివే..
నిబంధనల ఉల్లం‘ఘనుల’పై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జరిమానాలు
జమచేయకుంటే వాహనం
సీజ్ చేస్తామంటున్న సీపీ

చలాన్లు.. చాలానే..

చలాన్లు.. చాలానే..

చలాన్లు.. చాలానే..

చలాన్లు.. చాలానే..

చలాన్లు.. చాలానే..