
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
● ఆర్డీఓలు, తహసీల్దార్ల
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
న్యూశాయంపేట: భూ భారతి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్ నుంచి మంగళవారం జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలోగా పరిష్కరించలేని దరఖాస్తుల వివరాల నివేదికను తయారుచేయాలని తహసీల్దార్లకు సూచించారు. రెవెన్యూ రికార్డుల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని, తహసీల్దార్ల కార్యాలయాల్లో విధిగా రిజిస్టర్లు, బయోమెట్రిక్ అటెండెన్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఆర్డీఓల పరిధిలోని తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలు, పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వీడి యో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఏఓ విశ్వప్రసాద్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు.