
ముగిసిన చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగం సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం జిల్లాస్థాయి మూడో ర్యాంకింగ్ చదరంగ పోటీలు ముగిశాయి. ముఖ్య అతిథిగా ఎన్‌ఐటీ టెక్నికల్ ఆఫీసర్ సుధాకర్ హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేసి అర్జున్‌ను స్ఫూర్తిగా తీసుకుని చదరంగంలో రాణించాలని సూచించారు. నిర్వహణ కార్యదర్శి పి.కన్నా మాట్లాడుతూ అండర్–7,9,11,13,15 బాలబాలికల విభా గాల్లో పోటీలకు జిల్లా వ్యాప్తంగా 70 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్లు ప్రేమ్‌సాగర్, వైశాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అధిక ధరలకు సరుకులు
విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు
ఖిలా వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగా యల మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్ వ్యాపారులు, వర్తక సంఘం ప్రతినిధులు టెండర్ పేరుతో సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే లైసె న్స్‌లు రద్దు చేస్తామని మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు, వినియోగదారులతో ఏజెంట్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పదోన్నతుల ప్రక్రియ
పారదర్శకంగా నిర్వహించాలి
విద్యారణ్యపురి: జిల్లాలోని ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిచాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో టీపీటీఎఽఫ్ బాధ్యులతో కలిసి సత్యనారాయణ సూపరింటెండెంట్ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎం.రఘుపతి, జిల్లా మాజీ అధ్యక్షుడు బీమళ్ల సారయ్య, జిల్లా బాధ్యులు రవి, రాజు, సదానందం పాల్గొన్నారు.
నేడు ‘గ్రేటర్’ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్‌ను సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సమస్యలపై రాత పూర్వకంగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి
న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో సోమవారం(నేడు) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించాలని సూచించారు.
గణపతి రుద్రుడిగా
రుద్రేశ్వరస్వామికి అలంకరణ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో భాద్రపద మాసం శుద్ధ పాడ్యమి ఆదివారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని గణపతి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు పానుగంటి ప్రణవ్, పెండ్యాల సందీప్‌శర్మ పూజలు నిర్వహించారు.
డీఈఈ సెట్ స్పాట్ అడ్మిషన్లు
విద్యారణ్యపురి: డైట్ కళాశాలల్లో ప్రవేశాలకు డీఈఈ సెట్ అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్ల రెండో దశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ వరంగల్, హనుమకొండ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్‌హై ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా డీఈఈసెట్–2025లో అర్హత సాధించి ఉండాలని, ప్రభుత్వ డైట్ కళాశాలలో ఈనెల 26న, ప్రైవేట్ కళాశాలల్లో ఈనెల 28న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు ఈనెల 29న ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు.

ముగిసిన చదరంగం పోటీలు

ముగిసిన చదరంగం పోటీలు