
ఉత్సాహంగా స్పోర్ట్ ్స డే రన్
వరంగల్ స్పోర్ట్స్: హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ డీఎస్‌ఏ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్పోర్ట్స్‌డే రన్‌లో యువత, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ను స్మరించుకుంటూ ఈ నెల 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంది. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.