
గ్రామాల్లో సమస్యలపై మంత్రి ఓఎస్డీకి వినతులు
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓఎస్డీ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. మండలంలోని రామ్‌నగర్, రంగయ్యపల్లి, రత్నగిరి, వంగర, కొప్పూర్, గాంధీనగర్, కొత్తపల్లి, భీమదేవరపల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో వీరేశం, ఎంపీవో నాగరాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వినయ్‌రెడ్డి, ఏవో పద్మ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.