
రేపు జాబ్‌మేళా
న్యూశాయంపేట: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఉపాధి కల్ప నాధికారి వరంగల్ ఆధ్వర్యంలో ప్రథమ్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో ఈనెల 20న బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళా హనుమకొండ ములుగురోడ్డులోని ఎంప్లాయ్‌మెంట్(ఐటీఐ క్యాంపస్) కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 70931 68464 నెంబర్‌లోగాని, కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా
గుణశేఖర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా గుణశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్న గుణశేఖర్‌ను రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు బదిలీ చేసింది. ఈసందర్భంగా పోలీస్ అ ధికారులు నూతన డీసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలు అందించారు.
విద్యార్థి అప్పగింత
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండకు చెందిన ఓ విద్యార్థి ఆకతాయి వేషాలు ఉపాధ్యాయులనే కాదు అతడి తల్లిదండ్రులను బురడీ కొట్టించాయి. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మనుగొండకు చెందిన ఓ విద్యార్థి(12) తన గ్రామంలో ఏడో తరగతి వరకు చదివి 8వ తరగతిలో సమీపంలోని గంగదేవిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేరాడు. అతడు గుండె, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తరచుగా ఉపాధ్యయులకు చెప్పేవాడు. సదరు విద్యార్థి పాఠశాల వరకు వచ్చి తరగతి గదులకు వెళ్లకుండా బయటతిరిగి బడి ముగిసే సమయానికి తోటి విద్యార్థులతో కలిసి ఇంటికి వెళ్లేవాడు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ కుమారుడు బడికివెళ్లి వస్తున్నాడనే భ్రమల్లో ఉండేవారు. సోమవారం అతడు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో సదరు విద్యార్థి తండ్రి కంబాల రంజిత్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆచూకీ కోసం రెండు బృందాలతో గాలింపు జరిపి విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు.
ఆధ్యాత్మికతలో జీవించాలి
హన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని వారణాసి సంత్ రవిదాస్ ఆశ్రమం పీఠాధిపతి ఆచార్య భరత్‌భూషన్‌దాస్ ఉద్బోధించారు. సోమవారం వెయ్యి స్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా వారిని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్ ఆలయమర్యాదలతో స్వాతించారు. స్వామివారిని రుద్రాభిషేకం నిర్వహించుకున్న అనంతరం ఆలయనాట్యమండపంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ఈఓ అనిల్‌కుమార్ ఆచార్యులకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను పండ్లను అందజేశారు. శ్రావణమాసోత్సవాల్లో భాగంగా చివరి సోమవారం స్వామివారిని సర్పరుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రీ రిపబ్లిక్ డే
శిబిరానికి ఎంపిక
కేయూ క్యాంపస్: గుజరాత్ పాటన్ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 31 నుంచి నిర్వహించనున్న ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు కేయూలో సోమవారం ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ కార్యాలయం సూపరింటెండెంట్ సంజయ్, కేయూ పరిధి ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆర్.ప్రవీణ్‌కుమార్, అశోక్ మోరె, పిరాధిక, దత్తాత్రేయ, సతీశ్‌చంద్ర, వలంటీర్లు పాల్గొన్నారు.

రేపు జాబ్‌మేళా

రేపు జాబ్‌మేళా