
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై ఆరా..
ధర్మసాగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి తెలుసుకునేందుకు రాష్ట్ర హౌసింగ్ ఎండీ గౌతమ్ సోమవారం మండల కేంద్రంలో పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు. అనంతరం వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని హౌసింగ్ ఏఈ సుష్మాను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్దార్థ్, డీఈ రవీందర్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంపీఓ అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.