భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం | - | Sakshi
Sakshi News home page

భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం

Aug 10 2025 5:22 AM | Updated on Aug 10 2025 5:22 AM

భద్రక

భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం

హన్మకొండ కల్చరల్‌: శ్రావణపౌర్ణమిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శనివారం పవిత్రోత్సవం నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తి, స్నపనమూర్తులకు అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ పవిత్రోత్సవంతో ఆలయం, సకల జనులకు పవిత్రత చేకూరుతుందని అన్నారు. రక్షాబంధన విశిష్టతను వివరించారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

అంగడి రోడ్డుపై

డీపీఓకు ఫిర్యాదు

గీసుకొండ: మండలంలోని కొమ్మాల అంగడి రోడ్డు నిర్మాణంపై కాంట్రాక్టర్‌ గుగులోత్‌ రాజు డీపీఓకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శనివారం అంగడి ద్వారా రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల మేర ఆదాయం రావాల్సి ఉండగా తాజాగా రూ.1.30 లక్షలు మాత్రమే వచ్చిందని తెలిపాడు. ఫలితంగా తాము నష్టపోవాల్సి వస్తోందని డీపీఓకు విన్నవించాడు. రోడ్డు నిర్మాణ పనులను మధ్యలో ఆపివేసి ఆటంకం కలిగించడంతో రైతులు, కొనుగోలుదారులు అంగడికి రావడం లేదని పేర్కొన్నారు. డీపీఓ ఆదేశాల మేరకు ఎంపీడీఓ పాక శ్రీనివాస్‌ రోడ్డు, అంగడి ప్రాంతాన్ని పరిశీలించారు. తనకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీడీఓ హామీ ఇచ్చినట్లు కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపాడు.

రైతుబీమాకు వివరాలివ్వాలి

న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని రైతులందరు రైతుబీమా చేయించుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం రైతులకు రూ.ఐదు లక్షల బీమా చేయిస్తుందని తెలిపారు. 18–59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, పట్టాదారు పాసుబుక్‌ ఉన్న రైతులు అర్హులన్నారు. గత సంవత్సరం బీమా చేయించుకున్న రైతులు నామిని పేరు, ఇతర సవరణలు చేసుకోవడానికి మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీలోగా పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌, నామిని వివరాల జిరాక్స్‌ ప్రతుల వివరాలు సంబంధిత వ్యవసాయాధికారికి సమర్పించాలని ఆమె సూచించారు.

లక్ష్మీనర్సింహస్వామికి

సహస్ర పుష్పార్చన

గీసుకొండ: శ్రావణ మాసం మూడో శనివారం సందర్భంగా మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారికి గులాబీ పూలతో సహస్ర పుష్పార్చన, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్ర, ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ వీరాటి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్పోకెన్‌ ఇంగ్లిష్‌, స్కిల్స్‌లో

శిక్షణ తరగతులు

కేయూ క్యాంపస్‌: కేయూలోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ (సెల్ట్‌) ఆధ్వర్యంలో 40 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మేఘనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను ఈనెల 30 వరకు నమోదు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ విద్యార్థులకు రూ.200, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు, మహిళలకు ఇతరులకు రూ.1,500 ఫీజు చెల్లించి ఈనెల 30 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి శిక్షణ తరగతులు నిర్వహిచనున్నట్లు పేర్కొన్నారు.

భద్రకాళి అమ్మవారికి  పవిత్రోత్సవం1
1/2

భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం

భద్రకాళి అమ్మవారికి  పవిత్రోత్సవం2
2/2

భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement