ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిగా ప్రశాంత్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిగా ప్రశాంత్‌కుమార్‌

Aug 9 2025 8:50 AM | Updated on Aug 9 2025 8:50 AM

ఎస్‌జ

ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిగా ప్రశాంత్‌కుమార్‌

హన్మకొండ చౌరస్తా: పాఠశాల క్రీడల సమాఖ్య హనుమకొండ జిల్లా కార్యదర్శిగా వెలిశెట్టి ప్రశాంత్‌కుమార్‌ నియమితులైనట్లు డీఈఓ వాసంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండేళ్లపాటు ఈపదవిలో కొనసాగుతారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశాంత్‌కుమార్‌ ప్రస్తుతం కాజీపేట మండలం తరాలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తనను నియమించిన డీఈఓ వాసంతికి ధన్యవాదాలు తెలియజేయగా.. పీఈటీల సంఘం జిల్లా అద్యక్షుడు శీలం పార్థసారధి, కార్యదర్శి కె.మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోగ సుధాకర్‌, పీడీలు వెంకటేశ్వర్లు, కరుణాకర్‌, సుభాశ్‌, సురేశ్‌, నాగరాజు, రాజు.. ప్రశాంత్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.

అనుమతి లేని స్కూళ్లపై

చర్యలు తీసుకోవాలని వినతి

విద్యారణ్యపురి: జిల్లాలో అనుమతిలేకుండా నడుస్తున్న స్కూళ్లపై, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అనుమతిలేకుండా మారుస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ డిస్ట్రిక్ట్‌ అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ (హడుప్సా) జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చిబాబు, జనరల్‌ సెక్రటరీ మాడుగుల సంతోశ్‌రెడ్డి ఇతర బాధ్యులు శుక్రవారం కలెక్టర్‌ స్నేహ శబరీష్‌కు, డీఈఓ డి.వాసంతికి, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రంగయ్యనాయుడికి వేర్వేరుగా వినతి పత్రం అందించారు. హడుప్సా ట్రెజరర్‌ డి.శంకర్‌, చీఫ్‌ అడ్వయిజర్‌ వర్దమాను జనార్దన్‌, ఉపాధ్యక్షుడు టి.రాజేశ్వర్‌రావు, జిల్లా బాధ్యులు బి.వెంకటరెడ్డి, వి.మధుకర్‌రెడ్డి, ఆర్‌.నవీన్‌రెడ్డి, సి.రామారావు, కె.వాసుదేవరెడ్డి, అనిల్‌ పాల్గొన్నారు.

వైద్యుడు సృజన్‌ సస్పెన్షన్‌

ఎంజీఎం: వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ ప్రత్యూష కేసులో ఎంజీఎం వైద్యుడు శ్రీనివాస్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈమేరకు సృజన్‌ను సస్పెండ్‌ చేస్తూ.. డీఎంఈ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న సృజన్‌ జూన్‌ 15న ప్రత్యూషను వేధించడంతో ఆమె ఉరేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు సృజన్‌ను బీఎస్‌ఎన్‌ యాక్ట్‌ 108, 115(2), 292, 351(2), సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నిట్‌తో నోయిడా మిస్టోటెక్స్‌

టెక్నాలజీ ఎంఓయూ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌తో నోయిడాకు చెందిన మిస్టోటెక్స్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుదీ తెలిపారు. జాతీయ రహదారుల భద్రత, చలనం, వినియోగదారుల సంతృప్తిని మెరుగుపర్చే ఏఐ ఆధారిత పరిశోధన కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిట్‌ రిజిస్ట్రార్‌ సునీల్‌కుమార్‌ మెహతా, ప్రొఫెసర్లు వెంకట్‌రెడ్డి, శంకర్‌, కేవీఆర్‌ రవిశంకర్‌, అర్పణ్‌ మెహర్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ ఫ్యాకల్టీ, మిస్టోటెక్స్‌ సంస్థ తరఫున చేతన్‌కుమార్‌, మాజీ సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా స్వర్ణ సుబ్బారావు పాల్గొన్నారు.

ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా  కార్యదర్శిగా ప్రశాంత్‌కుమార్‌1
1/2

ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిగా ప్రశాంత్‌కుమార్‌

ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా  కార్యదర్శిగా ప్రశాంత్‌కుమార్‌2
2/2

ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిగా ప్రశాంత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement