
దోమల నియంత్రణలో భాగస్వాములవ్వాలి
హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య
హన్మకొండ: దోమల నియంత్రణలో భాగస్వాములవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సీజనల్ వ్యాధులు, దోమల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సందేశాత్మకంగా ఏర్పాటు చేసిన దోమతెర, దోమలకు ఆవాసాలైన నీటి కుండీలు, తదితర ప్రదర్శనలను వీక్షించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.మదన్ మోహన్ రావు, వైధ్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్లు బాబు, విప్లవ్‌కుమార్, మరియా థామస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డ్రై డే, జ్వర సర్వే పర్యవేక్షణలో భాగంగా గోపాల్‌పూర్ ప్రాంతంలోని వేంకటేశ్వర కాలనీలో పర్యటింటించి దోమలు నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.