
పంచాయతీ కార్యదర్శులతో గూగుల్ మీట్
నర్సంపేట: చెన్నారావుపేట మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి కల్పన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని 30 గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గూగుల్ మీట్ నిర్వహించారు. గ్రామాల వారీగా ఓటరు జాబితాల తయారీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్‌లో భాగంగా తొమ్మిది అంశాలపై నివేదిక తయారు చేసి సెంట్రల్ సర్వర్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. విధుల్లో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అనంతరం శంకరంతండా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. పంచా యతీ కార్యదర్శి ప్రమీలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆమె వెంట ఎంపీడీఓ నల్ల శ్రీవాణి, చెన్నారావుపేట ఇన్‌చార్జ్ ఎంపీఓ రామ్మోహన్, మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యుడు సృజన్ సస్పెన్షన్
ఎంజీఎం: వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ ప్రత్యూష కేసులో ఎంజీఎం వైద్యుడు శ్రీనివాస్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈమేరకు సృజన్‌ను సస్పెండ్ చేస్తూ.. డీఎంఈ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న సృజన్ జూన్ 15న ప్రత్యూషను వేధించడంతో ఆమె ఉరేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు సృజన్‌ను బీఎస్‌ఎన్ యాక్ట్ 108, 115(2), 292, 351(2), సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిట్‌తో నోయిడా మిస్టోటెక్స్
టెక్నాలజీ ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో నోయిడాకు చెందిన మిస్టోటెక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. జాతీయ రహదారుల భద్రత, చలనం, వినియోగదారుల సంతృప్తిని మెరుగుపర్చే ఏఐ ఆధారిత పరిశోధన కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్‌కుమార్ మెహతా, ప్రొఫెసర్లు వెంకట్‌రెడ్డి, శంకర్, కేవీఆర్ రవిశంకర్, అర్పణ్ మెహర్, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, మిస్టోటెక్స్ సంస్థ తరఫున చేతన్‌కుమార్, మాజీ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు పాల్గొన్నారు.
మొక్కలు నాటేలా చర్యలు
రామన్నపేట: గృహాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ఆర్పీ (రీసోర్స్ పర్సన్)లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా.. శుక్రవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మెప్మాకు చెందిన ఆర్పీలకు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి చేపట్టారు. ఈసందర్భంగా.. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. సోమవారం నుంచి ప్రతీ వార్డులో కార్యక్రమాలు ఏర్పాటు చేసి మొక్కలు అందజేయాలని, ఈబాధ్యత ఆర్పీలదేనని స్పష్టం చేశారు. శానిటేషన్, హార్టికల్చర్ విభాగాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ.. స్థానిక కార్పొరేటర్ల సహకారంతో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కమిషనర్ సూచించారు.
వంచనగిరిలో అదృశ్యం.. నెక్కొండలో ప్రత్యక్షం
నెక్కొండ: గీసుకొండ మండలంలోని వంచనగిరిలో 85 ఏళ్ల వృద్ధురాలు తప్పిపోయి నెక్కొండలో శుక్రవారం ప్రత్యక్షమైంది. నెక్కొండ ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వంచనగిరి గ్రామానికి చెందిన గూబల నర్సమ్మ నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి తప్పిపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. చివరకు మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా, సదరు వృద్ధురాలు నెక్కొండ జూనియర్ కళాశాల వెనుక ఉన్న విషయాన్ని పోలీసులకు సమాచారం స్థానికులు అందించారు. పోలీసులకు సంఘటనా స్థలికి చేరుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం నర్సమ్మను ఆమె కోడలు గూబల విజయ, మనుమడు ప్రేమ్‌కుమార్‌కు అప్పగించామని ఎస్సై పేర్కొన్నారు.

పంచాయతీ కార్యదర్శులతో గూగుల్ మీట్