
మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలి
ఆత్మకూరు: మధ్యాహ్న భోజనంలో మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జెడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగారు. అనంతరం ఆత్మకూరులో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లింగమడుగుపల్లిలో ఉపాధి పథకంలో రైతు నాటిన మామిడి మొక్కల్ని పరిశీలించారు. ఉపాధి పథకాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు పుల్లా నిర్మలకుమారి, జీపీ కార్యదర్శులు సంధ్య, శ్వేత, మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు ఉన్నారు.