హన్మకొండ కల్చ రల్: శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంరోజున వరలక్ష్మీవ్రతం జరుపుకోవడం సంప్రదాయం. ఈ మేరకు శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేందుకు మహిళలు సిద్ధమయ్యారు. వ్రతానికి కావాల్సిన పూలు, పండ్లు, తమలపాకులు, సుగంధ ద్రవ్యాల కొనుగోళ్లతో నగరంలోని పలుకూడళ్లలో గురువారం రద్దీ ఏర్పడింది. పూల ధరలకు రెక్కలు వచ్చాయి.
పవిత్రోత్సవాలు ప్రారంభం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో గురువారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, వేద విద్యార్థులు హోమాలు నిర్వహించారు.
కోటలో విదేశీయుల సందడి
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను గురువారం ఇటలీ దేశస్తులు సందర్శించారు. ఈసందర్భంగా మధ్య కోటలోని కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్‌మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిల గుట్ట, శృంగారపు బావిని తిలకించారు. శిల్పాల ప్రాంగణంలో నాటి శిల్పులు చెక్కిన అద్భుత శిల్ప సంపదను ఆసక్తిగా పరిశీలించారు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కాకతీయుల చరిత్ర, విశిష్టత తెలుసుకున్నారు. కోట విశిష్టతను పర్యాటశాఖ గైడ్ రవియాదవ్ వారికి వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. విదేశీయుల వెంట కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్‌చార్జ్ అజయ్ ఉన్నారు.
కేయూలో ముందస్తు
రక్షాబంధన్ వేడుకలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులు ముందస్తుగా గురువారం రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. పరిపాలనా భవనంలో వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫైనాన్స్ ఆఫీసర్ మహ్మద్‌అబీబుద్దీన్‌కు మహిళా ఉద్యోగులు డాక్టర్ ఎస్.సుజాత, బి.కృష్ణవేణి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం అభివృద్ధిలో ప్రతిఒక్కరి తోడ్పాటు అవసరమన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలతాదేవి, సూపరింటెండెంట్లు హేమారాణి, నర్మద, ఎస్.పద్మావతి, ఉద్యోగులు ఉన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం
విద్యారణ్యపురి: చట్టాలపై అవగాహన అవసరమని, అవసరం ఉన్నవారు ఉచిత న్యాయ సలహాలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ క్షమాదేశ్‌పాండే సూచించారు. న్యాయసేవా సాధికార సంస్థ, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు న్యాయవిజ్ఞాన సదస్సులు అవసరమని పేర్కొన్నారు. కేయూ పాలకమండలి సభ్యురాలు కె.అనితా రెడ్డి మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోగలుగుతారన్నారు. చట్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, న్యాయవా ది గోపిక, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆ ఫీసర్లు రాజ్‌కుమార్, దయాకర్ అధ్యాపకులు పాల్గొన్నారు.
యువకుడి హల్‌చల్
చార్మినార్: పాతబస్తీ ఘాజీబండకు చెందిన మహ్మద్ అజర్ అనే యువకుడు ఆదివారం వైట్నర్ మత్తులో చార్మినార్ కట్టడంపై హల్‌చల్ సృష్టించాడు. చార్మినార్ పిట్టగోడ పైకెక్కి కిందికి దూకే ప్రయత్నం చేశాడు.

నేడు వరలక్ష్మీవ్రతం