
పన్ను వసూళ్లపై దృష్టి సారించండి
నగర మేయర్ గుండు సుధారాణి
రామన్నపేట: నీటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. పీఓఎస్ మిషన్లకు ట్రాకింగ్ వ్యవస్థ ఉంటే ఐసీసీ కేంద్రానికి అనుసంధానం చేయాలన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా భువన్ సర్వే చేపట్టాలని, ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన రూ.48 కోట్ల నీటి పన్ను బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.