
యువత డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు
పర్వతగిరి: యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు ఆయన పర్వతగిరి సర్కిల్ ఆఫీస్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ అంకిత్‌కుమార్‌కు ఏసీపీ, సీఐలు మొక్కను అందజేశారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్ పరిసరాలు, స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడాలన్నారు. ప్రజలకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ముందుకు సాగాన్నారు. క్రిమినల్ కేసులు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ ఎన్.వెంకటేశ్, పర్వతగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.రాజగోపాల్, ఎస్సైలు బి.ప్రవీణ్, నరేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్