
ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్‌కు కృషి
నెక్కొండ: మండల పరిధిలోని రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్‌కు కృషి చేస్తున్నట్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవనీత్‌సింగ్‌ని కలిసి రైళ్ల హాల్టింగ్ విషయం గురించి వివరించి వినతి పత్రం అందించారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ నిలిపి వేయడంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి ఎంపీ బలరాం నాయక్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా స్పందించిన ఎంపీ మంత్రిని ఢిల్లీలో కలిసి 9 మండలాల ప్రజలు సుమారు 300 మంది రైలు మార్గం ద్వారా ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తారని వివరించారు. త్వరలోనే పలు రైళ్ల హాల్టింగ్‌కు మోక్షం లభించనుందని ఎంపీ తెలిపారు.
ఎంపీ పోరిక బలరాంనాయక్