
ఎంజీఎంకు వైద్య పరికరాల అందజేత
ఎంజీఎం : వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వివిధ వ్యాధులతో బాధపడే పేద రోగులకు సేవలందించడం కోసం సుబేదారిలోని కాకతీయ హైస్కూల్‌కు చెందిన 1990 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఒక డీ – ఫీబ్రీలెటర్, 12 వీల్ చైర్లను బుధవారం ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌కుమార్, డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఆర్యంల సమక్షంలో ఆర్‌ఎంఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు సత్యనారాయణరావు, విజయకుమార్, శ్రీనివాస్, చిట్టి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.