
సాగునీటి పనుల కోసం పాదయాత్ర
● స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య
వేలేరు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.104 కోట్లతో ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎమ్మెల్యే కడి యం శ్రీహరి పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. సాగునీటిపనుల పునఃప్రారంభం కోసం త్వరలోనే వేలేరు నుంచి గండిరామారం వరకు పాదయాత్ర చేస్తానని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని మద్దెలగూడెం, పీచర, శాలపల్లి, గొల్లకిష్టంపల్లి, వేలేరులో ఆయన ఊరూరా సంక్షేమ ఫలాలు–ఇంటింటికీ కేసీఆర్ పథకాలు కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మండల ఇంచార్జి భూపతిరాజు, మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, మండల కోఆర్డినేటర్ గోవింద సురేశ్, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, నర్సింగరావు, సూత్రపు సంపత్ తదితరులు పాల్గొన్నారు.