
డెయిరీ ఏర్పాటుకు చర్యలు
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులతో అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారద, పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. డెయిరీ ద్వారా నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను తీసుకొద్దామని, ఇందుకు అవసరమైతే ములుకనూరు మహిళా డెయిరీ సహకారం తీసుకుందామన్నారు. పాలసేకరణ నుంచి మార్కెటింగ్ వరకూ అన్నీ కూడా ప్రణాళిక ప్రకారంగా నాణ్యతగా ఉండేలా ప్రజల మన్నన పొందేలా కృషి చేయాలన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. డెయిరీ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ములుకనూరు డెయిరీ జీఎం భాస్కర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఆర్డీఓలు మేన శ్రీను, కౌసల్య దేవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పంటలు పరిశీలించిన శాస్త్రవేత్తలు
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృదం, హనుమకొండ వ్యవసాయ సంచాలకులు మంగళవారం పలు రకాల పంటలు పరిశీలించారు. ప్రస్తుతం వరిలో సల్ఫైడ్ ఇంజూరీ ఉన్నట్లుగా గుర్తించారు. నివారణకు పొలం మొత్తం ఆరబెట్టి జింక్ చెలమిన్‌ను పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పత్తిలో పేనుబంక, పచ్చదోమ, తామర పురుగుల బెడద, రసం పీల్చే పురుగుల బెడద ఉధృతి ఉన్నట్లు గమనించారు. వీటి నివారణకు ఆసిటామీప్రిడ్ 40గ్రామ్స్ ఎకరాకి, ఽథాయామిత్తక్సమ్ 40 గ్రామ్స్ ఎకరాకు పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకట్‌రెడ్డి, డాక్టర్ రాములు, డాక్టర్ పద్మజ, డాక్టర్ మధు, సహాయ సంచాలకులు ఆదిరెడ్డి, మండల అధికారి ఎల్.పద్మ, ఏఈఓలు సుమలత, రవితేజ, నాగరాజు, కమలహాసన్, శైలజ, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

డెయిరీ ఏర్పాటుకు చర్యలు