
ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
పరకాల: వర్షాకాలంలో ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ అన్నారు. మంగళవారం కమిషనర్ సుష్మ, మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారితో కలిసి మున్సిపాలిటీ పరిధి 9వ వార్డులోని శ్రీనివాసకాలనీలో పర్యటించారు. వర్షాకాలంలో వరద ముంపుతో ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంటుందని, కాల్వల నుంచి కొట్టుకొస్తున్న చెత్తా చెదారంతో కాలనీ ప్రజలు రోగాల పాలవుతున్నారని కమిషనర్‌కు పూర్ణాచారి వివరించారు. ఈసందర్భంగా సుష్మ మాట్లాడుతూ.. వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న డ్రెయినేజీలతో పట్టణ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించినట్లు అవుతుందన్నారు. పారిశుద్ధ్యంతో పాటు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారితో పాటు శ్రీనివాసకాలనీవాసులు పాల్గొన్నారు.
పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ
వరద ముంపు ప్రాంతాల పరిశీలన