
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ
సంఘం అధ్యక్షుడు ఆనందం
హన్మకొండ: ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు ఎ.ఆనందం అన్నారు. సోమవారం రాత్రి నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయ ఆవరణలోని స్పోర్ట్స్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని, ఆర్టిజన్‌న్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు. అనంతరం అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మాసు చొక్కారావు, కార్యదర్శిగా చుంచు శిరీష్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శితో పాటు మాజీ కార్యదర్శి దర్శనాల మొగిలయ్యను అసోసియేషన్ నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్చాలు అందించి సన్మానించారు. సమావేశంలో అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యదర్శి కుమారస్వామి పాల్గొన్నారు.