
పావులీటర్ అంటే 150మి.లీ.అన్నమాట!
శాయంపేట: మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ షాపులో ట్రైకం అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రన్‌అవుట్ 23 పురుగు మందు బాటిళ్లను సీజ్ చేసినట్లు ఏఓ గంగాజమున తెలిపారు. మండలంలోని సూరంపేట గ్రామానికి చెందిన రైతు చంద రమేశ్ పావులీటర్ రన్‌అవుట్ పురుగు మందు బాటిల్‌లో 150 మిల్లీలీటర్ల మందు మాత్రమే వస్తోందని ఇటీవల ఏఓ గంగాజమునకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె షాపులో ఉన్న 23 రన్ అవుట్ పురుగు మందు బాటిళ్ల అమ్మకాలను నిలిపివేస్తూ నోటీసులు ఇచ్చి లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ విశ్వేశ్వర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇస్మాయిల్ రన్‌అవుట్ పురుగుమందు డబ్బాలను తనిఖీ చేసి కొలువగా 250 మిల్లీలీటర్ బాటిల్‌లో 150 మిల్లీలీటర్ మాత్రమే ఉంది. దీంతో 23 బాటిళ్లను సీజ్ చేసి డీలర్‌పై, కంపెనీపై కేసు నమోదు చేయనున్నట్లు లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ తెలిపినట్లు ఏఓ గంగాజమున పేర్కొన్నారు.
పురుగు మందుల కంపెనీ లెక్క ఇదీ..
23 పురుగుమందుల బాటిళ్లు సీజ్
డీలర్, కంపెనీపై కేసు నమోదు
చేయనున్నట్లు అధికారుల వెల్లడి