
కార్యకర్తలను కాపాడుకుంటా..
ఐనవోలు: కాంగ్రెస్ నాయకులకు భయపడొద్దని, కార్యకర్తలను కాపాడుకునే శక్తి తనకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఐనవోలు, పంథిని పున్నేలు, ఒంటిమామిడిపల్లి, లింగమోరిగూడెం తదితర గ్రామాలకు చెందిన 90 మంది ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లోని కొంతమంది నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. స్థానిక ఎన్నికలకు ముందు మాత్రమే బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటామని, ఆ తర్వాత చేరుతామనేవారికి నోఎంట్రీ బోర్డు పెడతామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దుమ్ము దులుపుడే అంటూ శ్రేణులను ఉత్సాహపరిచారు. మండల కన్వీనర్ తంపుల మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చందర్‌రావు, ఎన్నికల ఇన్‌చార్జ్ గోపాల్‌రావు, ఎండీ ఉస్మాన్‌అలీ, గుంషావలీ పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు