
మాడవీధుల పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ స్థపతి వల్లీనాయగం శుక్రవారం శ్రీభద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. రాజగోపురాల నిర్మాణంపై, అమ్మవారి ఆలయానికి దక్షిణంవైపు మాడవీధుల నిర్మాణానికి పలు సూచనలు చేశారు. స్థపతి సూచనలను ఈవో ద్వారా దేవాదాయశాఖ ఆమోదానికి పంపిస్తామని కుడా అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు భద్రకాళి శేషు, పరి శీలకులు అద్దంకి విజయ్‌కుమార్, కుడా పీవో అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, డీఈఈ రఘుబా బు, కాంట్రాక్టర్ శ్రీధర్‌రావు పాల్గొన్నారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలించారు.
హకీంపేటకు దీటైన క్రీడా పాఠశాల
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌కు దీటుగా హనుమకొండలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్(క్రీడా పాఠశాల) కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, కడి యం శ్రీహరి తెలిపారు. శుక్రవారం వారు కలెక్టర్ స్నేహ శబరీశ్, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ కమిషనర్ చౌహాన్ బాజ్‌పాయ్, వివిధ శాఖల అధికారులతో కలిసి హనుమకొండలో ని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. స్టేడియంలో కొనసాగుతున్న రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ బాలబాలికల భవనాలను పరి శీలించారు. ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, ఇతర వివరాలను డీవైఎస్‌వో గుగులోతు అశోక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మొదటగా తాత్కాలిక పాఠశాలను ప్రారంభించేందుకు కావాల్సిన సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టా రు. దీని కోసం కచ్చితమైన ప్రణాళిక అమలు కు కసరత్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.
రేపు భక్తి మందారాలు పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్ : కాకతీయ పద్యవేదిక ఆధ్వర్యంలో ‘కవిచంద్ర’ నర్సింగోజు లక్ష్మయ్య రాసిన భక్తి మందారాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈనెల 3న ఉదయం 9గంటలకు హనుమకొండలోని ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో జరుగుతుందని కవితావేదిక కార్యదర్శి చేకూరి శ్రీరామ్, కన్వీనర్ అక్కెర కరుణాసాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పద్యకవి కమ్మేళనం ఉంటుందని, జిల్లా కవులు, కళాకారులు పాల్గొనాలని కోరారు.
రోగులకు అందుబాటులో ఉండాలి
ఎంజీఎం/హన్మకొండ చౌరస్తా: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే రోగులకు అందుబాటులో ఉండేలా సమయపాలన పాటించాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన నగరంలోని పెద్దమ్మగడ్డ పీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో డ్రైడే కార్యక్రమం తీరును పరిశీలించారు. ఏఎన్‌ఎం నమోదు, ఎన్‌సీడీ రీ స్క్రీనింగ్, ఫీవర్ సర్వే జరుగుతున్న తీరు, ల్యాబ్ ఫార్మసీని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ..తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యంపై అవగాహన కల్పించాలని, అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి సమిష్టి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సంజయ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ రుక్ముద్దేన్, ఆర్.వినోద్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పశువైద్యాధికారిగా డాక్టర్ రాధాకిషన్
హన్మకొండ: హనుమకొండ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారిగా డాక్టర్ వై.రాధాకిషన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జనగామ జిల్లా పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా పశు వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ వై.రాధాకిషన్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ హనుమకొండ జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారిగా నియమించారు. ఈయన కంటే ముందు హనుమకొండ జిల్లా పశు వైద్యాధికారిగా పరకాల సహాయ సంచాలకుడు డాక్టర్ విజయభాస్కర్ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు.

మాడవీధుల పనుల పరిశీలన

మాడవీధుల పనుల పరిశీలన