యూనిఫామ్‌లు ఇంకా ఇవ్వలేదా? | - | Sakshi
Sakshi News home page

యూనిఫామ్‌లు ఇంకా ఇవ్వలేదా?

Aug 2 2025 6:03 AM | Updated on Aug 2 2025 6:03 AM

యూనిఫామ్‌లు ఇంకా ఇవ్వలేదా?

యూనిఫామ్‌లు ఇంకా ఇవ్వలేదా?

వేలేరు: పాఠశాలలు ప్రారంభమై నెలల గడుస్తున్నా యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు ఎందుకు ఇవ్వలేదని సంబంధిత అధికారులపై కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల, శాలపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను ప్రశ్నించగా..కొంతమంది విద్యార్థులు తమకు ఇంకా పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్స్‌ రాలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టోర్‌ రూమ్‌ను పరిశీలించగా కొన్ని కూరగాయలు కుళ్లిపోయి ఉండటంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైనింగ్‌ హాల్‌ను సందర్శించి భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు మెనూ పక్రారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం శాలపల్లిలోని అంగన్‌వాడీల్లో మెనూ పాటించడం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి బిల్లులు సకాలంలో వస్తున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ హెచ్‌.కోమి, ఎంపీడీవో లక్ష్మీప్రసన్న, ఎంపీవో భాస్కర్‌, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ అజయ్‌కుమార్‌ను ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

పరిశ్రమలకు వేగంగా అనుమతులు..

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో వైవీ గణేశ్‌, డీఆర్‌డీవో మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌ సింగ్‌, డీపీవో లక్ష్మీరమాకాంత్‌, రవాణా శాఖ ఎంవీఐ వేణుగోపాల్‌, విద్యుత్‌ ఎస్‌ఈ మధుసూదన్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ సునీత, లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ మహేందర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాలరాజు, డీటీడీవో ప్రేమలత, టీజీఐసీసీ మేనేజర్‌ మహేశ్‌, జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి లక్ష్మణ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తల్లిపాల ప్రాముఖ్యంపై

అవగాహన కల్పించాలి..

తల్లిపాల ప్రాముఖ్యంపై ప్రజలకు, పాలసీ నిర్ణేతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధికారులకు సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డీఎంహెచ్‌వో అప్పయ్య, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి మహేందర్‌, సీడీపీవోలు విశ్వజ, స్వాతి, పోషణ అభియాన్‌ కోఆర్డినేటర్‌ సుమలత, జిల్లా మాస్‌ మీడియా అధికారి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కుళ్లిన కూరగాయలతో కూరలు వండుతారా..

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

అధికారులు, సిబ్బందిపై కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆగ్రహం

వేలేరు మండలంలో గురుకుల పాఠశాల, అంగన్‌వాడీల్లో తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement