కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి
పర్వతగిరి: ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. జిల్లాలో అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు పండించిన ధాన్యం తడవకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ప్రభుత్వం సూచించిన మేరకు రైతుల నుంచి ధాన్యం ధాన్యం పక్కాగా సేకరించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి రైస్ మిల్లర్లకు తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ కౌసల్యదేవి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటస్వామి, ఏపీఎం కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం తడవకుండా జాగ్రత్తపడాలి..
ఖానాపురం: రైతులు వర్షాలతో ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తపడాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మండలంలోని ఖానాపురం, పెద్దమ్మగడ్డ, మనుబోతులగడ్డ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కలెక్టర్ కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకోగానే రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. వర్షాలతో తేమశాతం వచ్చేలా లేదని, ధాన్యాన్ని బాయిల్డ్ మిల్‌కు పంపి న్యాయం చేయాలని వేడుకున్నారు. అదనంగా మరో కిలో కోతతో ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేయించాలని కోరడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ రైతులకు తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ నీరజ, డీఎం సంధ్యారాణి, డీఎస్‌ఓ కిష్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, డీటీ సంధ్యారాణి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ కృష్ణ, ఏఓ శ్రీనివాస్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ


