అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్‌గుప్తా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుకుల్ల మహాలక్ష్మిశంకరమ్మ, శ్రీనివాస్‌రజిత దయాకర్, సాయితేజ, స్వాతిలు పడిపూజ బాధ్యులుగా పాల్గొనగా ప్రధాన అర్చకులు దేవిష్‌మిశ్రా తాంత్రిక పూజ విధానంలో అయ్యప్పస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అచల్ దేవిష్‌మిశ్రా, కేతుడి భవాని, అశోక్‌రెడ్డి, ఎర్ర జగన్‌మోహన్‌రెడ్డిర్మిల, లింగాల అమృతవంశీధర్‌రెడ్డి, పబ్బ దీప్తి, సదాశివుడు, గుట్టం వినిత్, వంశీకృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 27నుంచి నిర్వహించాల్సిన ఎంబీఏ, ఎంసీఏ మూడవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. యూజీసీనెట్, టీజీసెట్, టీజీటెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు.
ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం మార్పు
నర్సంపేట: నర్సంపేట ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ (కరెంటు బిల్లులు చెల్లించే కార్యాలయం) నెక్కొండ రోడ్డు నుంచి మల్లంపల్లికి రోడ్డులోని సబ్‌స్టేషన్ దగ్గర డివిజన్ ఆఫీస్‌లోకి మార్చినట్లు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఆకవరపు మధుసూదన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులు ఈ మార్పును గమనించి వల్లబ్‌నగర్ సబ్‌స్టేషన్ దగ్గర ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్‌లో బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు.
‘నేరెళ్ల’ పురస్కారానికి రామా చంద్రమౌళి ఎంపిక
హన్మకొండ కల్చరల్: నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారానికి వరంగల్‌కు చెందిన కవి, నవలా రచయిత రామా చంద్రమౌళిని ఎంపిక చేసినట్లు నేరెళ్ల వేణుమాధవ్ కల్చ రల్ ట్రస్ట్ అధ్యక్షురాలు నేరెళ్ల శోభావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో జరిగే ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతి కార్యక్రమంలో రామా చంద్రమౌళికి పురస్కారం అందజేస్తామని శోభావతి పేర్కొన్నారు.


