స్థల పరిశీలన
పర్వతగిరి: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలోని పల్లవి మోడల్ పాఠశాలలో త్వరలో నిర్వహించనున్న 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు అవసరమైన స్థలం, గదులను గురువారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. పాఠశాల చైర్మన్ రాచకొండ అశోకచారిను వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు అనుకూల వాతావరణం ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్‌నాయక్, సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, నాయకులు పాల్గొన్నారు.


