క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
గీసుకొండ: గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో కాక వెంకటస్వామి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.


